ప్రజాసంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ పై చరిత్ర లేని నాయకులు విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. పక్కరాష్ర్ట పార్టీల జెండాలను మోసే నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో లేని ఎన్నో కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రవేశ పెడుతున్నారని కవిత గుర్తుచేశారు. ప్రజా సంక్షేమం కోసం పార్లమెంటులో గళం వినిపించే అవకాశం కల్పించిన నిజామాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని ఎంపీ కవిత చెప్పారు. రైల్వే బడ్జెట్ లో పెద్దపల్లి-నిజామాబాద్ లైనుకు రూ. 141 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.
చరిత్ర లేని నాయకులు విమర్శిస్తున్నారు




