Wednesday, 4 November 2026

చర్లపల్లి జైల్లో సెల్‌ఫోన్లు, గంజాయి

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి): జైలు నిబంధనలను చాలామంది ఖైదీలు తుంగలో తొక్కుతున్నారు. అందుకు ప్రత్యక్షసాక్ష్యం చర్లపల్లి జైల్లో ఖైదీల వద్ద దొరికిన సెల్‌ఫోన్లు, మాదక ద్రవ్యాలు. చర్లపల్లి జైలులోని మానస బ్యారక్‌లో భాను కిరణ్‌, పహిల్వాల్‌ నుంచి 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మరో ఇద్దరు ఖైదీల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మాకమైన చర్లపల్లి జైల్లోనే ఇలాంటి ఘటనలు జరిగితే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో పరిస్థితి చెప్పనవసరం లేదు. పోలీసులే డబ్బులకు ఆశపడి ఖైదీలకు సహాయం చేస్తుంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *