Tuesday, 3 November 2026

చలో అసెంబ్లీని ప్రభుత్వ అడ్డుకుంటోంది

శ్రీనివాస్‌ గౌడ్‌
మహబూబ్‌నగర్‌: చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ గజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజమవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చూసిన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 14న ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీ రార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నింస్తుందని హైదరాబాద్‌కు ఎవరూ రాకుండ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఐకాస నాయకులు, ఉద్యోగులపై బైంబోవర్‌ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు  ఇప్పటికైనా ‘చలో అసెంబ్లీ’అనుమతి కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *