హైదరాబాద్: చలో అసెంబ్లీ కారణంగా రేపు కొన్ని రైలు సర్వీసులకు అంతరాయం
ఏర్పడనుంది.ఫలక్‌నుమా`సికింద్రాబాద్, ఫలక్‌నుమా`హైదరాబాద్, లింగంపల్లి`హైదరాబాద్, ఫలక్‌నుమా`సికింద్రాబాద్, బొల్లారం`సికింద్రాబాద్, ఎంఎంటీఎస్‌లు, డెమూ సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి`సికింద్రాబాద్ మధ్య ఎంఎంటీఎస్ నడుస్తాయి. బొల్లారం`హైదరాబాద్, తాండూర్`హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్`తాండూర్, వరంగల్`హైదరాబాద్, మిర్యాలగూడ`కాచిగూడ డెమూలు రద్దయ్యాయి. ముంబయి`హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, బీదర్`హైదరాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లింగంపల్లిలో నిలిపివేస్తారు. త్రివేండ్రం`హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో నిలిపివేస్తారు.




