చలో కొమురవెల్లి పోస్టర్ ఆవిష్కరణ
చలో కొమురవెల్లి పోస్టర్ ను నంగునూరు మండల కురుమ సంఘం అధ్యక్షుడు బెదురు తిరుపతి కురుమ కులస్తులతో కలిసి బుధవారం రోజున సిద్దన్నపేట గ్రామంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూలై 4న దొడ్డి కొమురయ్య వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.కురుమ కులస్తులు అందరూ ఈ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. జయంతితో పాటు వర్ధంతి కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం చైర్మన్ పదవిని కురుమలకే వచ్చేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా నాయకులు వాసర యాదములు, జిల్లా నాయకులు మల్లేశం, ఎల్లయ్య తడకపల్లి శ్రీనివాస్ నర్సింలు మల్లేశం, కైలాస్, సంతు, రాకేష్, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీను, రాజు తదితరులు ఉన్నారు.