చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: న్యూ డెమోక్రసీ.

బూర్గంపహాడ్ జూలై 02(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జులై 4న చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరణ, ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా లక్ష్మీపురం, టేకులచెరువు, రాజీవ్ నగర్, ముసలమడుగు, బూర్గం పహాడ్, సారపాక పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి  గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి కనీసం ఇళ్ల స్థలాలు, సొంత ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయాలని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపాలి లేదా నిరుద్యోగ భృతి చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని జులై 4న హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, ఐ ఎఫ్ టి యు నాయకులు వై ఎస్ రెడ్డి, పి డి ఎస్ యు జిల్లా నాయకులు బర్ల రామకృష్ణ, న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, స్థానిక నాయకులు బట్టు రవి, బచ్చల నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, దొడ్డుపల్లి సావిత్రి, శైలజ, తేజావత్ దేవి తదితరులు పాల్గొన్నారు.