పరిసరాల పరిశుభ్రత పాటించాలి

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి  అరుణ్ కుమార్,
ఖానాపురం జూలై 2జనం సాక్షి
మనుబోతుల గడ్డ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మల్యాల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో
మెడికల్ క్యాంపు నిర్వహించారు.147 మందికి
బీపీ పరీక్షలు,షుగర్ పరీక్షలు,జ్వర పరీక్షలు మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు.అలాగే
సాధారణ జలుబు దగ్గు. బిపి షుగర్. మందులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా వైద్యాధికారి అరుణ్ కుమార్ మాట్లాడుతూసీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని
ప్రతివారం డ్రై డే పాటించాలని
దోమల  పెరగకుండా మందులు పిచికారి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రుచిత, ఏ ఎన్ ఎం సునీత,భాస్కర్,భార్గవి,ఆశాలుదేవేంద్ర,పద్మ,,విజయ,సునీత, సబితగ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area