శీతకాలం సందర్భంగా 6 నెలల పాటు బ్రేక్ పడిన చార్‌ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. హిమాలయా పర్వతాల్లో ఉన్న గంగోత్రి యమునోత్రి ఆలయాలను తిరిగి తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ సారి ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం కనబడుతోంది.
ప్రత్యేక పూజలు నిర్వహించాక భక్తుల కోసం ఈ రెండు ఆలయాలను తెరుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి హరిద్వార్ ఎంపీ రమేష్ పోక్రియాల్ , గంగోత్రి ఎమ్మెల్యే గోపాల్ రావత్. గంగా యుమున దేవతలకు ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు వేల సంఖ్యలో దేశనలుమూలల నుంచి తరలి వచ్చారు.
మిగతా రెండు ప్రధాన ఆలయాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్‌ను మే 3, మే 6 నుంచి భక్తుల కోసం తెరచి ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ రెండు ఆలయాల్లో ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు.




