అటు నేపాల్, ఇటు ఉత్తర, ఈశాన్య భారతంలో భూకంపంతో చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. హిమాలయాల సానువుల్లోని ఉత్తరాఖండ్ రాష్ర్టంలో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రినాథ్ పుణ్యక్షేత్రాల యాత్రను ఆరు నెలల తర్వాత మొన్ననే ప్రారంభించారు. రెండేళ్ల కిందట అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదల్లో చార్ ధామ్ యాత్రికులు వేల మంది గల్లంతయ్యారు. ఇవాళ భూకంపం వచ్చిన ప్రాంతానికి ఆ నాలుగు పుణ్యక్షేత్రాలు దగ్గరగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేశారు.
చార్ ధామ్ యాత్ర నిలిపివేత




