Saturday, 7 November 2026

చిదంబరం వ్యాఖ్యలు సరికావు:ఎంపి వినోద్‌

హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్లే ఆత్మబలిదానాలు జరిగాయని అన్నారు. నిబంధనల మేరకే అప్పులు తెచ్చామని, జాబితాలో తెలంగాణ 13వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చిదంబరం వ్యాఖ్యలు చేశారని, వాస్తవాలతో లేఖ

రాస్తానన్నారు. గతంలో తెలంగాణ పనితీరును చిదంబరం మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వినోద్‌ గుర్తుచేశారు.