చిన్నారితో నదిలో దూకిన మహిళ

చిత్తూరు,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): నాలుగేళ్ళ బాబుతో సహ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. శాంతిపురం మండలం తలార్లపల్లి గ్రామం వద్ద పాలేరు నదిలో దూకి నాలుగేళ్ళ బాబుతో సహ ఆత్మహత్యకు పాల్పడింది. కాగా… భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. సమాచారమందుకున్న పోలీసులు పాలేరు నది వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు