Wednesday, 4 November 2026

చిలీలో మల్లిమస్తాన్‌బాబు మృతదేహాన్ని..

పర్వతం పైనుంచి కిందకు తీసుకొచ్చిన రెస్క్యూటీం

న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 14: చిలీలో పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని అక్కడి అధికారులు పర్వతంపై నుంచి కిందకు తీసుకొచ్చారు. మస్తాన్‌బాబు మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పార్థీవ దేహాన్ని చిలీ నుంచి నేరుగా చెన్నై విమానాశ్రయానికి తరలిస్తారు. ఆదివారానికల్లా మస్తాన్‌బాబు మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా మస్తాన్‌బాబు మృతదేమం తరలింపుపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *