Thursday, 5 November 2026

చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకోం

– చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు
– టీడీపీలో 30ఏళ్లు ఉన్నా..
– బాబు డ్రామాలు నాకు తెలుసు
– ఆపద్ధర్మ మంత్రి తలసాని
హైదరాబాద్‌, అక్టోబర్‌26(జ‌నం సాక్షి) : తెలంగాణలో చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని తాజా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్‌ను శుక్రవారం శ్రీనివాస్‌ యాదవ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాధ్యత గల వ్యక్తిపై దాడి జరిగినపుడు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. కుమ్మక్కై చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని తాము అనుకుంటే తట్టుకునే శక్తి చంద్రబాబుకు లేదన్నారు. భ్రష్టుపట్టిన రాజకీయాలతో విూరు బాగుపడలేరంటూ విమర్శించారు. జగన్‌పై దాడి వ్యవహారంలో టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, అటువంటివి తెలంగాణలో చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బాబు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ చూసి షాక్‌కు గురయ్యానన్నారు. చంద్రబాబుపై దాడి జరిగినపుడు విపక్షాలు పరామర్శించలేదా ? అని మంత్రి ప్రశ్నించారు. తాను టీడీపీలో 30 ఏళ్లు ఉన్నానని, వాళ్ల డ్రామాలన్నీ తనకు తెలుసని తలసాని తెలిపారు. ప్రతిపక్షనేతపై దాడి జరిగితే డీజీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చంద్రబాబును దెబ్బతీస్తాయని, ప్రజలుకూడా సహించరని అన్నారు. ఇప్పటికైన టీడీపీ నేతలు పద్దతిమార్చుకోవాలని, లేకుంటే వారికి తెలంగాణలో లాగానే ఆంధ్రాలోనూ అడ్రస్సు గల్లంతవుతుంది తలసాని సూచించారు