Tuesday, 3 November 2026

చురకుగా కదులుతున్న రుతుపవనాలు

4హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రుతుపవనాల రాకతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉండగా, 24 గంటల్లో కోస్తాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం సాయంత్రాని కల్లా అన్ని జిల్లాల్లో పూర్తిగా విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం పూర్తిస్థాయిలో ఏర్పడకపోయినా రుతుపవనాల కదలిక చురుగ్గానే ఉందని వెల్లడించారు. అరేబియా సముద్రంలో రుతుపవన ప్రవాహం బలపడగా కర్నాటక నుంచి కేరళ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిస్సాలో ఉపరితల ఆవర్తనం విదర్భ, తెలంగాణ పరిసరాల్లో ఆవరించి ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక మధ్య అరేబియా సముద్రం కొంకణ్‌, మహారాష్ట్ర,

విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్‌, యూపీ, బీహార్‌లోని పలు ప్రాంతాలు సహా కర్నాటక, చత్తీగఢ్‌లో అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలించడం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రం కొంకణ్‌, విదర్భ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీకి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఇటు రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రబావంతో పలుచోట్ల వర్షం కురిసింది.నల్లగొండ జిల్లా కోదాడలో జోరు వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *