చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దాం

 జెవివి మండల కార్యదర్శి రవికుమార్
పానుగల్ నవంబర్ 11,జనం సాక్షి
 ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దామని జెవివి మండల కార్యదర్శి రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించి,మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న 8,9,10వతరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు సైన్స్ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, జేవివి కార్యదర్శి ఆకాష్, ఉపాధ్యాయులు కురుమయ్య,సురేష్, సుంకన్న, చిన్ననాగన్న,నరసింహ, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.