చోడవరం : విశాఖ జిల్లా చోడవరం చ్కెర కర్మాగారంలో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. 500 కేవీ జనరేటర్లు రెండు పేలిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగుతు తీశారు. ఈ ఘటనతో కార్మాగారంలో రోజువారి క్రషింగ్ నిలిచిపోయింది. దాదాపు రూ. 50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.




