Thursday, 5 November 2026

18న భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి

హైదారాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబులు ఒకే విధమైన వ్యతిరేకతతో ఉన్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. వచ్చే నెల 18న భారీ ఎత్తున మాదిగలను సవిూకరించి అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. గజ్వేల్‌లో ఆదివారం  ఇద్దరూ ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చి మాదిగల పక్షాన నిలిచి న్యాయం చేస్తామని చెప్పారని, గ్దదెనెక్కాక ఇద్దరు ఆ విషయాన్ని దాట వేస్తున్నారన్నారు. అందుకే వారి వైఖరిని నిరసిస్తూ  వర్గీకరణ సాధించి మాదిగలకు న్యాయం జరిగేవరకు తమ పోరాటాన్ని ఆపబోమన్నారు. ఇందులో భాగంగా 18న అసెంబ్లీ ముట్టడి చేప్టటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *