చేజారిన సిరీస్!
– మళ్లీ ఓడిన భారత మహిళల జట్టు
– నాలుగు వికెట్ల తేడాతో కివీస్ విజయం
ఆక్లాండ్, ఫిబ్రవరి8(జనంసాక్షి) : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు పరాజయం పాలయ్యారు. భారత్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మహిళలు ఆఖరి బంతికి ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దాంతో ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను న్యూజిలాండ్ మహిళలు 2-0తో కైవసం చేసుకున్నారు. న్యూజిలాండ్ క్రీడాకారిణుల్లో సుజీ బేట్స్(62) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు జతగా అవిూ సాటర్‌వైట్(23) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ సేన ఆదిలోనే తడబడింది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రియా పునియా ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్.. ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 72 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. అయితే మంధాన ఔట్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ క్రీజులో నిలదొక్కుకోకపోయారు. భారత బ్యాట్స్‌మెన్‌లో జెవిూమా రోడ్రిగ్స్(72) హాఫ్ సెంచరీ సాధించగా, స్మృతీ మంధాన(36) మోస్తరుగా రాణించారు. వీరిద్దరూ మినహా మిగతా వారు విఫలం కావడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో కివీస్ 33 పరుగుల స్కోరు వద్ద తొలి
వికెట్‌ను నష్టపోయింది. ఓపెనర్ సోఫీ డివైన్(19) మొదటి వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో కాట్లిన్ గుర్రే(4) వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తరుణంలో సుజీ బేట్స్-సాట్‌ర్‌వైట్ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయం పథంలో నడిపించింది. ఇక చివర్లో కివీస్ వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్‌కు కివీస్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం కాగా, తొలి బంతిని కేటీ మార్టిన్ ఫోర్ కొట్టారు. ఆపైమిగతా పనిని కాస్పరెక్(4 నాటౌట్), హనాహ్ రోవ్(4 నాటౌట్)లు పూర్తిచేసి జట్టుకు విజయం చేకూర్చారు. నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం జరుగనుంది.