బీజింగ్ :ఉత్తర చైనాలోని జాంగ్జియాకౌ పట్టణంలోని బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. గనిలోని ఎయిర్ కంప్రెషర్కు మంటలు అంటుకొని భారీగా వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో గనిలో 13 మంది కార్మికులు ఉన్నారు. గల్లంతైన మిగతా ఇద్దరి కోసం అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గత ఏడాది చైనాలోని గనుల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో 1384 మంది మృతి చెందారు.




