చెన్నై, జనంసాక్షి: చెన్నైలో ఓ వైద్య విద్యార్థిని అదృశ్యమైంది. చెన్నైలోని ఓ దంతవైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తున్న సుప్రియ అనే విద్యార్థిని ఆచూకీ తెలియరావటం లేదు. వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఆమె సమాచారం గత పదిరోజులుగా తెలియకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




