Tuesday, 3 November 2026

చైన్‌ స్నాచింగ్‌కు విఫలయత్నం

హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి )  : నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌ చేయడానికి గుర్తు తెలియని దొంగ యత్నించాడు. గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీ(46) మహిళ కిరాణా షాప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన దొంగ మెడలోని పుస్తెల తాడు తెంపుకు పోయేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నాడు.