13మంది జవాన్లు మృతి
రాయ్‌పూర్, డిసెంబర్ 1 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది జవాన్లు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మరోసారి మారణ¬మం సృష్టించారు. మావోలపై పోలీసులుపై చేయా సాధించారనుకొంటున్న తరుణంలో పోలీసులపై మెరుపుదాడి చేశారు. సుకుమా జిల్లా చింతగుపా సవిూపంలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు.మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. స్థానికులను రక్షణగా వాడుకుని మావోయిస్టులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడిన జవాన్లను ప్రత్యేక వాహనాల్లో అధికారులు ఆసుపత్రికి తరలించారు. రేపటి నుంచి పీఎల్ జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. మావోయిస్టుల దాడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్ర-ఒరిస్సా, చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులను ప్రభుత్వాలు అప్రమత్తం చేసాయి. అప్రమత్తంగా ఉండాల్సిందిగా మావో ప్రాబల్యం ఉన్న రాష్టాల్రను కేంద్ర ¬ం శాఖ సోమవారం హెచ్చరించింది.





