కోహిమా, డిసెంబర్ 1 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నాగాలాండ్ రాష్టాన్న్రి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మోదీ హావిూ ఇచ్చారు. సోమవారం మోదీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో పర్యటించారు. కోహిమాలో జరుగుతున్న హార్న్ బిల్ ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కానని నరేంద్ర అన్నారు. గత ప్రధాని 10 ఏళ్లలో నాగాలాండ్ కు రాలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి అన్నారు. తాను నాగాలాండ్ ప్రజలతో తరచుగా సమావేశమవుతానని చెప్పారు. ఈశాన్య రాష్టాల్రు సహజ ఆర్థిక మండళ్లని పేర్కొన్నారు. తన తొలి ప్రాధాన్యం ఈ సహజ ఆర్థిక మండళ్లపైనేని వెల్లడించారు. ప్రధాని త్రిపురలో కూడా పర్యటించారు. త్రిపురలో రూ.10వేల కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సోమవారం ఆయన త్రిపురలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ విద్యుత్ రంగంపై సార్క్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌కు విద్యుత్ పంపిణీ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్న మోదీ అభివృద్ధిలో మార్గ దర్శకత్వానిదే కీలకపాత్ర అని పునరుద్ఘాటించారు
బీఎస్‌ఎఫ్‌కు వందనం
సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్) అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీఎస్‌ఎఫ్‌కు వందనం చేస్తున్నానని ట్వీట్ చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో దేశాన్ని కాపాడడానికి నిరంతరం శ్రమిస్తున్న జవాన్లకు వందనాలు సమర్పించారు. వారి పట్టుదల, సాహసం ఎల్లప్పుడూ స్ఫూర్తివంతం అని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బీఎస్‌ఎఫ్ సోమవారం 49వ అవతరణ దినోత్సవం జరుపుకొంటోంది.





