మిరుదొడ్డి ,ఆగస్టు 15,(జనంసాక్షి):
ప్రేమకు ప్రతిరూపమైన రాఖి పండుగను ఆంగన్ వాడి చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సోవం మంగళవారం రొజున అంగన్ వాడి బడిలో ఘనంగా జరుపుకున్నారు. రాఖీలను గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రతాప్ రెడ్డి మరియు ఉ.సర్పంచ్ పోలబొయిన చంద్రాగౌడ్ లకు మరియు గ్రామ పెద్దలకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించిరు. సర్పంచ్ లక్ష్మిప్రతాప్ రెడ్డి గారు రాఖీలకు బహుమతిగా అంగన్ వాడి బడి చిన్నారులకు చేర్స్ ఇప్పిస్తానని హమీ ఇచ్చారు.అనంతరం అంగన్ వాడి టిచర్ కళావతి జెండా ఎగరవేశారు. సర్పంచ్ మరియు ఉ.సర్పంచ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రదానోపాద్యయులు సందిట యాదగిరి వార్డు మెంబర్లు భూపాల్ రెడ్డి గ్రామ పెద్దలు హరిప్రసాద్ యాదగిరి బిక్షపతి సిద్దిరాంలు పర్శరాములు ఆశవర్కర్ లు లత ప్రశాంతి.విసిఓ లావణ్య తదితరులు పాల్గోన్నారు.
జంగపల్లి అంగన్ వాడి పాఠశాలలో స్వాతంత్ర్య సంబరాలు




