జంగయ్య యాదవ్ అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీరం జంగయ్య యాదవ్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సమయంలో గుండెపోటుకు గురై నిన్న రాత్రి అక్కడికక్కడే మరణించారు. ఆయన మరణ వార్త టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ రోజు ఉదయం వారి స్వగ్రామం రాయినిగూడెంలో సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, యంపీపి నల్లగాసు జాను యాదవ్, బిజేపి సీనియర్ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్ జంగయ్య పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ మాట్లాడుతూ జంగయ్య యాదవ్ అనేక సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో ఉంటూ వివిధ స్థాయిలలో ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే ఓ పోరాట శక్తి ఈరోజు కనుమరుగై పోవటం హృదయ దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆశ్రువులు రాల్చారు. పదవులకు అతీతంగా పార్టీ ఉన్నతి కోసం కృషిచేసే జంగయ్య గారి మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తంచేశారు. భాద తప్త హృదయంతో అంతిమ వీడుకోలు పలికి విషాదంలో మునిగిపోయిన జంగయ్య గారి కుటుంబాన్ని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు