Tuesday, 3 November 2026

జంట పదవుల్లో ఒకటి బీసీలకు ఇవ్వండి

చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌
హైదరాబాద్‌ : తెలుగుదేశం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష పదవి లేదా ప్రతిపక్ష నాయుకుడి పదవిని ఆ వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. జంట పదవుల్లో ఏదో ఒకటి వదులుకోవడానికి సిద్ధపడని ఆయన బీసీల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మరని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమాణారెడ్డి, విప్‌లు అనిల్‌కుమార్‌, రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోమవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థానాన్ని ఆయన కుమారుడు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రులకు న్యాయ సహాయం అందించే విషయాన్ని ‘పెద్దలు’ చూసుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా గండ్ర తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు సాయం అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *