అనంతపురం,నవంబర్2(జనంసాక్షి): తెగుళ్లతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు, సిపిఎం కేంద్ర కమిటి నేత వి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతిన్న ఉరవకొండ మండలంలోని నెరెమెట్ల గ్రామంలో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం పర్యటించి, ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ,ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి , సిపిఎం మండల నాయకులు రంగారెడ్డి, మధు తదితరులు పాల్గోన్నారు




