హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): కోడికత్తి దాడి ఘటనలో గాయపడిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. జగన్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించాలని విూడియా ప్రతినిధులు కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. జగన్‌ను పరామర్శించడానికి వచ్చానని.. రాజకీయాల ప్రస్తావనకు ఇది సమయం కాదన్నారు. సమయం వచ్చినపుడు తప్పకుండా మాట్లాడతానని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు.




