Tuesday, 3 November 2026

జగన్‌ పదయాత్రలో ఇక మిగిలేది ఆ ఐదుగురే: అచ్చెన్న

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ముగిసేసరికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైసీపీలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇడుపులపాయ నుంచి జగన్‌ చేపట్టిన పాదయాత్రతో మా ప్రభుత్వానికి కాదు మా పార్టీకి కూడా ఎటువంటి నష్టం కలుగదని ఆయన పేర్కొన్నారు. జగన్‌ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర చేయడం సరికాదని ఆయన చెప్పారు. 1100 కాల్‌సెంటర్‌ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. జగన్‌కు ప్రజల సమస్యలపై చిత్తశుద్ది లేదని, కేవలం సిఎం కావాలనే తపన తప్ప మరోటి లేదన్నారు. జగన్‌ ఎన్ని కబుర్లుచెప్పినా ఆయన చరిత్రప్రజలకు తెలుసని అన్నారు.