హైదరాబాద్: చంచల్ గూడ జైలులో జగన్ రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారో లేదోజైళ్ల శాఖ డీజీ సమాధానం చెప్పాలని తేదేపా డిమాండ్ చేసింది. జైలులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇవన్నీ అధికారులు, మంత్రులు , ముఖ్యమంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కిరణ్ పరోక్షంగా జగన్‌ను కాపాడుతున్నారని విమర్శించారు. జగన్ ములాఖత్‌లపై యనమల రామకృష్ణుడు సమగ్ర వివరాలు అడిగితే కొన్ని ప్రశ్నలకే సమాధానం పేర్కొన్నారు. బినామీ ములాఖత్‌ల పై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




