జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైకాపా నేత రాజగోపాల్‌

 

ఎన్‌ఇనకలను బహిష్కరించిన టిడిపి

విజయవాడ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌తో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్‌ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్‌

చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్‌ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో కారణంగా ఛైర్మన్‌ ఎన్నిక శుక్రవరాం వాయిదా పడిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక పక్రియ పూర్తయింది. మెజార్టీ లేకున్నా చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు అధికార టీడీపీ విశ్వప్రయత్నం చేసినా మెజారిటీ వైసీపీ వైపు ఉండడంతో ఆపార్టీ అభ్యర్ధి రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. దీంతో చైర్మన్‌ ఎన్నికను టీడీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. నిన్న జరిగిన హంగామాతో

జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. ఎన్నిక పక్రియ శుక్రవారం ఉత్కంఠగా మొదలై తీవ్ర ఉద్రిక్తత మధ్య వాయిదా పడింది. స్థానిక పురపాలక కార్యాలయాన్ని పూర్తిగా పోలీసులతో బందోబస్తు చేసి ఎన్నిక నిర్వహించే ప్రయత్నం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య సహా తెదేపా సభ్యులంతా ఎన్నికల అధికారి ముందు నాలుగు గంటల పాటు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన విజయవాడ ఆర్డీవో హరీష్‌ ఎట్టకేలకు ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా అనూహ్య పరిణామాల మధ్య మొదలైన ఎన్నికకు వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి ఇంటూరి చిన్నా సహా 16 మంది సభ్యులు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యతో సహా మొత్తం 11 మంది తెదేపా సభ్యులు హాజరయ్యారు. ఇద్దరు తెదేపా కౌన్సిలర్లను ఇంటూరి చిన్నా అపహరించారని ఆయనపై నమోదైన కేసులను ప్రస్తావించడంతో పాటు తమను మార్గమధ్యలో వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను, అతని అనుచరులు అడ్డుకుని రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ ఎన్నిక వాయిదా వేయాలని తెదేపా సభ్యులంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అపహరణకు గురైన తమ సభ్యులు వచ్చేంత వరకు ఎన్నికను జరగనివ్వబోమని పట్టుపట్టారు. ఎన్నికకు అవసరమైన కోరం ఉన్నందున వాయిదా సాధ్యం కాదని ఆర్డీవో చెప్పినా వారు ఆందోళన విరమించలేదు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ అక్కడ బల్లలను పడేశారు. ఆర్డీవో ముందు ఉన్న బల్లపై కొడుతూ, ఆయన కుర్చీని కూడా నెట్టేశారు. ఒక దశలో ఆర్డీవో మాట్లాడే మైక్‌ వైరును లాగి పడేశారు. అనంతరం మైక్‌ మొత్తాన్ని తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా సభ్యుల నినాదాలతో కార్యాలయం దద్దరిల్లింది. ఎన్నిక నిర్వహణ సజావుగా సాగేందుకు ఇరు పార్టీలు పూర్తిగా సహకరించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో ఒకదశలో హెచ్చరించారు. పలుమార్లు వారిని వారించడంతో పాటు, ఉద్రిక్తతను నిలువరించేందుకు ఒకసారి అరగంట, మరోసారి పావుగంట పాటు పక్రియను వాయిదా వేశారు. ఎట్టకేలకు 3 గంటల సమయంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తూ హరీష్‌ ప్రకటన చేశారు. దీంతో తిరిగి శనివారం ఎన్నికను పూర్తి చేశారు.

 

తాజావార్తలు