జనం తోనే రణం.
దౌల్తాబాద్,జూన్ 28 జనం సాక్షి.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ ఎంపీటీసీ తిరుపతి కి అనారోగ్యంతో స్వల్పంగా ఆపరేషన్ చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ముభారస్ పూర్ గ్రామానికి వెళ్లి అతని పరామర్శించారు.అతని తో మాట్లాడుతూ హాస్పటల్లో డాక్టర్ చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులతో మాట్లాడి అసంతృప్తిగా ఉన్న ముదిరాజ్ భవనానికి నిధులు మంజూరు చేయాలని వాళ్ళు కోరగానే తప్పకుండా చేయి స్తాని అన్నారు.
అలాగే కోనాపూర్ సంబంధించిన డబుల్ బెడ్ రూం లు ఆ గ్రామ సర్పంచ్,మాజీ సర్పంచ్ వాళ్లతో కలిసి తొందరగా లబ్ధిదారులకు అందే విధంగా కాంట్రాక్టర్ తో మాట్లాడి పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచులు యాదగిరి,దార సత్యం, స్వామి, స్వప్నజనార్దన్ రెడ్డి, మరియు టిఆర్ఎస్ నాయకులు ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.