జనవరిలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు


విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జనవరి 19 నుంచి 21 వరకు విజయనగరంలో నిర్వహించనున్నామని రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎ.హైమ తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి గౌహతిలో జరగబోయే జాతీయ స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల నేపథ్యంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరపనున్నామన్నారు. అలాగే వచ్చే ఏడాదిలో జరగబోయే క్రీడల నిర్వహణ కేలండర్‌ను రూపొందించనున్నామని, మరో 15 రోజుల్లో కేలండర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు వారు విజయనగరంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అథ్లెటిక్స్‌ అభివృద్ధికి క్రీడా క్యాలెండర్‌ రూపొందించామని అన్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరి 6నుంచి 10వరకు అస్సాం రాష్ట్రం గౌహతీలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి పోటీలను విజయనగరంలో జనవరి 19నుంచి21వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.