Tuesday, 3 November 2026

జనసేన రాకతో మారుతున్న సవిూకరణాలు

ఎవరికి వారు సొంత సర్వేలతో సంసిద్దత

విజయవాడ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకున్నా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఓ వైపు జనసేన మరోవైపు వైకాపా కాక రేపుతున్నాయి. వీరికి తగ్గట్లుగా టిడిపి కూడా ఎదురుదాడితో దీటుగా సమాధానం చెబుతోంది. అలాగే బిజెపి కూడా టిడిపి లక్ష్యంగా విమర్శలకు దిగుతోంది. తొలిసారిగా ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్న జనసేన రాకతో జిల్లాల్లో రాజకీయం మారబోతోంది. పవన్‌కల్యాణ్‌ ప్రభావం వల్ల టీడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం.. అనేదానిపైనా జోరుగా ఊహాగానాలు, రాజకీయ చర్చలు సాగుతున్నాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించిన తర్వాత జరిగిన సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల ఎక్కువగా వైసీపీకే నష్టం వస్తుందని సర్వే సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన.. ఈ మూడు ప్రధాన పార్టీలు గెలిచే సత్తా ఉన్న వారి కోసం దృష్టిసారించాయి. ఇందులో భాగంగా పలు

నియోజకవర్గాల్లో మళ్లీ తాజాగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి నామమాత్రమేనని సర్వేలలో స్పష్టమవుతోంది. రాష్ట్రాన్ని విభజించారన్న ఆగ్రహంతో కాంగ్రెస్‌పైనా, విభజన హావిూలు నెరవేర్చలేదని బీజేపీపైనా కోపంతో ఉన్నారు.పలువురు ఎమ్మెల్యేలు, టికెట్లు ఆశించే ఆశావహులు కూడా ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వే నివేదికలు పరిశీలించి తమకు అనుకూలంగా ఉన్న అంశాలపై పార్టీ పెద్దలతో మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం కూడా ఇటీవల పలు అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేశారు. టీడీపీ నిర్వహించిన సర్వేలో జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో నిర్వహించిన సర్వేల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమం గతంలోకన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో చేసిన నియోజకవర్గాల్లో సైతం వ్యతిరేకత ఎందుకు వస్తోంది. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల పనితీరులో లోపాలు ఉన్నాయా? అనేదానిపైనా సర్వే బృందం ఆరా తీసింది. ఏయే ఎమ్మెల్యేలు, నియోకవర్గ ఇన్‌ఛార్జిలపై ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఉంది? అనేదానిపై పార్టీ కార్యాలయానికి వెళ్లిన నివేదికలూ కొంతమంది ఎమ్మెల్యేలకు చేరుతున్నాయి. ఈ నివేదికల ఆధారంగా కొంతమంది జాగ్రత్తపడుతుండగా.. ఇంకొంతమంది పట్టించుకోవడంలేదు. టీడీపీ పాలనపట్ల సామాన్య ప్రజల్లో మంచి మార్కులే వస్తున్నా, పార్టీ కేడర్‌లోనే కొంత అసంతృప్తి నెలకొన్నట్టు సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. నియోజకవర్గం, మండలం, గ్రామం.. అన్నింటా ఎమ్మెల్యే, నియోజకవర్గ స్థాయి నేతలే పెత్తనం చేస్తున్నారని, ఈ పద్ధతి మారకపోతే పార్టీ కేడర్‌ని సంతృప్తిపరచలేరంటూ అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఎవరైతే బలమైన అభ్యర్ధి అవుతారు..? అనేదానిపై సర్వేలతోపాటు.. ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులుగా తేలింది. వీరికి ప్రత్యర్థులుగా అంతే బలమున్న వారిని ఎంపిక చేసేందుకు సర్వే నివేదికలపై ఆధారపడిన వైసీపీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.