Wednesday, 4 November 2026

జపాన్‌లో వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు

kjavjbbrజపాన్‌లో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాలకు వరద తీవ్రత పెరిగి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు ఉత్తర ప్రాంతాన ఉన్న కినుగావా నది ప్రవాహం ఒక్కసారి పెరిగిపోవడంతో పరిసరప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు ఇండ్లు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహాయక సిబ్బంది వరదప్రాంతాలకు చేరుకుని బాధితులను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *