Thursday, 5 November 2026

జయశంకర్‌ సార్‌కు సిఎం కెసిఆర్‌ నివాళి

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్మరించుకున్నారు. జయశంకర్‌ సార్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి జయశంకర్‌ అని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగానే రాష్ట్రం అభివృద్ధి చెందింది అని సీఎం చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి జయశంకర్‌ ఆత్మకు శాంతి కలిగిస్తుందని సీఎం అన్నారు.