హైదరాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ బొల్లం తిరుపతి రాసిన మూడు జర్నలిజం పుస్తకాలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ప్రెస్ అకాడవిూ చైర్మెన్ అల్లం నారాయణ రిలీజ్ చేశారు. మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా, న్యూస్ ఇన్ ఎంటర్ టైన్మెంట్ బుక్స్ పేరుతో రిలీజ్ చేసిన పుస్తకాలు విూడియా రంగానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అందంగా., జనాలకు అర్ధమయ్యేలా చెప్పడమే జర్నలిజం అనీ., తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పత్రికలకు ఎడిటర్లు చాలా మంది తెలంగాణ వాళ్లే అనీ అల్లం నారాయణ చెప్పుకొచ్చారు.
జర్నలిజం పుస్తకాల ఆవిష్కరణ




