Tuesday, 3 November 2026

జర్నలిస్టు విధులను పక్కనపెట్టి బాలికకు క్రేనియోటమీ శస్త్రచికిత్స

హైదరాబాద్‌: నేపాల్‌ భూకంప బాధితుల వేదనను ప్రపంచానికి వినిపించేందుకు వెళ్లిన ఓ రిపోర్టర్‌ అత్యవసర పరిస్థితుల్లో తానే పూనుకుని వైద్యం చేయాల్సి వచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ బాలికకు బ్రెయిన్‌ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడాడు. అమెరికాకు చెందిన న్యూరోసర్జన్‌ డా. సంజయ్‌గుప్తా ఓ ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం కాఠ్‌మాండూలో సంభవించిన భూకంపాన్ని రిపోర్టింగ్‌ చేయడానికి సంజయ్‌గుప్తా నేపాల్‌ వెళ్లారు. కాఠ్‌మాండూలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన సంధ్య అనే బాలిక భూకంపంలో ఇంటిగోడలు కూలిపోయి తీవ్రగాయాలపాలైంది. రెండు రోజలు తర్వాత సంధ్యను కాఠ్‌మాండూలోని బీర్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావమై ఆమె తలలో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండటంతో సంజయ్‌గుప్తా తన జర్నలిస్టు విధులను పక్కనపెట్టి ఆ బాలికకు క్రేనియోటమీ శస్త్రచికిత్స చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *