జాతిపితకు గవర్నర్, సీఎం నివాళి
రాష్ట్రవ్యాప్తంగా జాతిపిత మహత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదారాబాద్ లంగర్ హౌజ్ లోని బాపుఘాట్ లో మహత్మునికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన నివాళీ అర్పించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియంతోపాటు మంత్రులు,పలువురు ప్రముఖులు కూడా గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్,సీఎం పాల్గొన్నారు.