రైతు సంక్షేమమే సిఎం లక్ష్యం: ఎమ్మెల్సీ
అనంతపురం,నవంబర్10(జనంసాక్షి): రైతు సంక్షేమమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. అవసరమైతే రెయిన్ గన్స్‌తో పంటలను రక్షించి రైతులను ఆదుకుంటామని నిరూపించిన ఘనత సిఎం చంద్ర బాబుదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించడం, రైతులకు రుణాలు ఇప్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన వేరుసెనగ విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ, వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తు, రాయితీపై రైతులకు సకాలంలో విత్తనాలు, పంట నష్టపరిహారం వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్నికూడా జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు విమర్శలు తప్ప రాష్ట్ర అభివృద్ది పట్టదన్నారు.




