Thursday, 5 November 2026

వర్షాధార పంటలతో లబ్ది

అనంతపురం,నవంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు వర్షాధార పంటలు సాగుచేసి బాగా లబ్ది పొందుతున్నరని వ్యవసాయాధికారులు అన్నారు. రైతులు సాగుచేసిన ఉద్యాన పంటల ఆదాయం పెరిగిందన్నారు. నీరు-చెట్టు పథకంతో నియోజకవర్గానికి దాదాపు 196 పనులు కల్పించినట్లు పేర్కొన్నారు. బిందు, తుంపరసేద్యాలతో ఉద్యానపంటలు సాగుచేసుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. తక్కువ నీటితో బిందు, తుంపరసేద్యాలను ఉపయోగించుకొని ఉద్యాన పంటలు పండించాలని, ఎక్కువ నీరు తీసుకొనే వరి పంటలు బోరుబావుల కింద వేయకూడదన్నారు. జిల్లాకు నీరు-చెట్టు పథకం కోసం మరే జిల్లాకు లేనంతగా రూ.290కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.