Monday, 2 November 2026

జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ నరసింహన్

tdp7mymcహైదరాబాద్ : భారతీయులకు ఈరోజు గొప్ప శుభదినమని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను పరిశీలించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. భారతీయులకు ఈరోజు గొప్ప శుభదినమని కొనియాడారు. తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణ భూములు తడవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రపంగం మొదట్లో, చివర్లో తెలుగులో మాట్లాడారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ, మంత్రులు, అధికారులు, డీజీపీతోపాటు పలువురు పాల్గొన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *