Tuesday, 3 November 2026

హైకోర్టును కూడా విభజించాలి:ఎంపీ వినోద్

indexహైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఏ విధంగా విభజించారో రాష్ట్ర హైకోర్టును కూడా అలాగే రెండుగా విభజించాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. విభజన తర్వాత మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో హైకోర్టులో కూడా అలాగే నడవాలన్నారు. హైకోర్టులో రెండు రాష్ర్టాలకు వేర్వేరుగా భవనాలు కేటాయించి కోర్టు వ్యవహారాలు నడపాలని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో తాము చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించిందని ఎంపీ వెల్లడించారు. ఈమేరకు కేంద్ర మంత్రి సదానందగౌడ లిఖితపూర్వక హామీ ఇచ్చారని వివరించారు.

‘చంద్రబాబునాయుడు కూడా స్పందించాలి’
ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా స్పందించాలని వినోద్ కోరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై స్పందించండం లేదన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. హైకోర్టును ఎంత తొందరగా విడగొడితే అంత మంచిదని వినోద్ సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *