జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి: కిల్లి

విజయనగరం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేస్తున్నామని, మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తసీఉకుని వస్తామని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కృపారాణి మాట్లాడుతూ.. జిల్లాలో ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఉమేష్‌ చాందీ పర్యటించనున్నారన్నారు. ఉమేష్‌ చాందీ పర్యటన అనంతరం అసెంబ్లీ సమన్వయ కమిటీలకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. రాహుల్‌ను ప్రధాని చేయడంతోపాటు, ఎపిలో టిడిపి ప్రభుత్వాన్‌ఇన సాగనంపేందుకు కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో కిల్లి కృపారాణితో పాటు ఎఐసిసి కార్యదర్శి క్రిస్టొఫర్‌ తిలక్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు