Monday, 2 November 2026

జిల్లాలో ప్రాదేశికంలో సత్తా చాటుతాం

అన్ని మండలాలను గెల్చుకుని జడ్పీ వశం చేసుకుంటాం
మాజీమంత్రి మహేందర్‌ రెడ్డి
వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  జిల్లాలోని 18 మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి నిరంతరం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సీఎం కేసీఆర్‌ను చూసి ప్రజలు ఆకర్శితులై టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టడానికి మరోసారి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి ఆగిపోకూడదంటే టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని  కోరారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఐదేండ్లుగా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌.1గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. గతంలో గతుకుల రోడ్లతో జనం ఇబ్బందు లు పడేవారని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్డు సదుపాయం, ప్రతి గ్రామపంచాయతీకి బీటీ రోడ్డు సదుపాయం కల్పిస్తుందని, ఇందుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కోట్లా ది రూపాయలు సర్కారు మంజూరు చేసిందన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 పైచిలుకు గురుకులాలు నెలకోల్పిందన్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పనులు మరింత వేగంగా చేపట్టడానికి సర్కారు నిర్ణయించిందన్నారు. రాబోయే రెండేండ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అన్ని జడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్‌, వైద్య మౌలికవసతుల కల్పన చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఉందని, ప్రత్యర్థి పార్టీలు ఖాళీ అయిపోయి అభ్యర్థులు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు.