జీన్స్‌ వేసుకోనందుకు రెస్టారెంట్‌లోకి రానివ్వలేదు

ముంబయి,జూన్‌8(జనం సాక్షి ): బాలీవుడ్‌ నటి యావిూ గౌతమ్‌ సోదరి సురీలీ గౌతమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం యావిూ ‘ఉరీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సెర్బియాలో జరుగుతోంది. చిత్రీకరణ నిమిత్తం యావిూ తన సోదరి సురీలీతో కలిసి సెర్బియా వెళ్లింది. సరదాగా బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి అక్కడి ఓ ఫేమస్‌ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడికి సురీలీ గౌను వేసుకుని వెళ్లింది. అక్కడి సిబ్బంది జీన్స్‌ వేసుకోలేదని ఆమెను రెస్టారెంట్‌లోకి రానివ్వలేదట. ఈ విషయాన్ని యామి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ‘మన ఎ/-లాన్‌ ప్రకారం రెస్టారెంట్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేయాలి కదా? మరి నువ్వేంటి రెస్టారెంట్‌ బయట కూర్చున్నావ్‌?’ అని వీడియోలో యామి… సురీలిని అడిగితే ఇందుకామె… ‘నేను జీన్స్‌ వేసుకోలేదని లోపలికి రావ్వలేదు’ అని చెబుతుండగా, ఇద్దరూ నవ్వుకుంటున్న వీడియోను యామి పోస్ట్‌ చేసింది. సురీలీ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారాగర్హి’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతోంది. రాజ్‌కుమార్‌ సంతోషి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యావిూ ‘ఉరీ’ చిత్రంతో పాటు ‘బత్తీ గుల్‌ విూటర్‌ చాలూ’ చిత్రంతోనూ బిజీగా ఉంది.