Tuesday, 3 November 2026

జీవన ప్రమాణాన్ని మెరుగు పరచాలనే లక్ష్యం తో తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి

 

తేదీ:19.09.2022
మన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యుల ఆదేశానుసారము రాష్ట్రం లోని మర మగ్గముల మరియు జౌళి పరిశ్రమల సమగ్ర అభివృద్ధి కొరకు, పవర్లూమ్, జౌళి రంగాలలో ఆధారపడిన కార్మికులకు నిరంతర పనిని కల్పించుటకొరకు, మరియు పవర్లూమ్ వస్త్రాలకు మంచి మార్కెట్ సదుపాయాలను కల్పించటమే కాక అపెరల్ రంగాన్ని అభివృద్ధి పరచి ఈ రంగం లో మరింత మంది కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాన్ని మెరుగు పరచాలనే లక్ష్యం తో తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయటం జరిగినది.
తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థకు చైర్మన్ గా శ్రీ గూడూరి ప్రవీణ్ గారిని జి.ఓ.నెం.1744 తేదీ.13.09.2022 ద్వారా ప్రభుత్వము నియమించటం జరిగినది.
శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గౌరవ పురపాలక , పరిశ్రమలు, ఐ.టి., చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు గారి సమక్షంలో శ్రీ గూడూరి ప్రవీణ్ గారు తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు పదవి స్వీకరించినారు. గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కే.టి.రామా రావు నూతనంగా తెలంగాణ మర మగ్గముల మరియు జౌళి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ పదవి స్వీకరించిన శ్రీ గూడూరి ప్రవీణ్ గారికి అభినందనలు తెలియచేసారు.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి, ఐ.ఏ.ఎస్, శ్రీ ఎల్.రమణ,ఎం.ఎ.ల్సి, శ్రీ దానం నాగేందర్. ఎం.ఎల్.ఏ, శ్రీ చందర్ రావు. ఎం.ఎల్.ఏ, శ్రీమతి.గుండు సుధారాణి, వరంగల్ నగర మేయర్, శ్రీ నారాదాసు లక్ష్మణ్ రావు, ఎం.ఎల్.సి, బసవరాజు సారయ్య, ఎం.ఎల్.సి, శ్రీ కోడుమూరి రవీందర్ రావు, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి. ఎం.ఎల్.సి, శ్రీ చింత ప్రభాకర్ తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, శ్రీ జిందం చంద్రకళ-చక్రపాణి, మునిసిపల్ ఛైర్పర్సన్ సిరిసిల్ల, శ్రీమతి నాల్యకొండ అరుణ, జిల్లా పరిషద్ ఛైర్పర్సన్, రాజన్న సిరిసిల్ల, శ్రీ మంచె శ్రీనివాస్, మునిసిపల్ వైస్ చైర్మన్, సిరిసిల్ల, శ్రీ తోట ఆగయ్య, జిల్లా టి.ఆర్.ఎస్. పార్టీ అధ్యషులు, శ్రీ గాజుల నారాయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మరియు జౌళి రంగ ప్రముఖులు, మర మగ్గాల ఆసాములు , కార్మికులు వందల సంఖ్య లో పాల్గొని నూతనంగా పదవి స్వీకరించిన శ్రీ గూడూరి ప్రవీణ్ గారికి అభినందనలు తెలియచేసారు. టెస్కో సంస్థ సిబ్బంది, తెలంగాణ టెస్కో ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.