Wednesday, 4 November 2026

జీవో నెం 120ని రద్దుచేయాలి

బాగ్‌లింగంపల్లి : కొల్లేరు ప్రాంత ప్రజల జీవనోపాధిని దెబ్బదీసే జీవో నెం 120 చిత్తడి నేలల పరిధి, ఎకోజోన్‌ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంగళ సుబ్బారావు, ఏపీ మత్స్యకారుల సంఘం జయ మంగళరావులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజలను, రైతులను బతకనివ్వాలని కోరుతూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేతి వృత్తిదారులు రాష్ట్ర కన్వీనర్‌ జమలయ్య, మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, సంఘం నేతలు బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా కాంటూరులో మెట్టను 5 నుంచి 3కు కుదించాలని అన్నారు. డీ ఫారమ్‌ రాయితీలను క్రమబద్దీకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *