– నగరాభివృద్ధిపై సవతితల్లి ప్రేమను చూపిస్తుంది
– పబ్లిసిటీ వచ్చేవాటినే.. కేటీఆర్ పట్టించుకుంటారు
– నేనిచ్చిన సమస్యలపై ఇప్పటి వరకు స్పందన లేదు
– నగరంలో కోట్ల మొక్కలు నాటామని నివేదికల్లో పేర్కొన్నారు
– ఆ మొక్కలు ఎక్కడున్నాయో చూపెట్టాలి
– మజ్లిస్ కనుసన్నల్లో తెరాస ప్రభుత్వం నడుస్తుంది
– డీఆర్‌సీ సమావేశాల నిర్వహణెళి మరిచారు
– విలేకరుల సమావేశంలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జులై27(జనం సాక్షి) : జీహెచ్‌ఎంసీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తున్నామని గొప్పలు చెబుతున్న తెరాస ప్రభుత్వం ఆమేరకు ఆచరణలో చూపడం లేదని, కేవలం నగరాభివృద్ధిపై సవతి తల్లి ప్రేమను చూపుతుందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరిచుకుపడ్డారు. పబ్లిసిటీ వచ్చే విషయాలపై తప్ప కేటీఆర్ వేరే విషయాలు పట్టించుకోరని ఆరోపించారు. సోషల్ విూడియా ద్వారా ఏ సమస్య తెచ్చినా పరిష్కరిస్తామని చెబుతున్న కేటీఆర్.. ఎమ్మెల్యేగా నేను పంపిన మెస్సేజ్‌లకు జవాబే లేదని మండిపడ్డారు. నగరంలో జరిగే అభివృద్ధి కంటే నివేదికలు బాహుబలి లెక్కల కంటే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక నగరంలో కోట్ల మొక్కలు నాటామని నివేదికలో పేర్కొన్నారని, ఆ మొక్కలు ఎక్కడున్నాయో చూపెట్టాలని డిమాండ్ చేశారు. మొన్న పురపాలకశాఖ ప్రగతి నివేదికతో పాటు యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారని, ఆ నివేదికలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో అరచేతిలో స్వర్గం చూపించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు 2016 డిసెంబర్ లో మూడు నెలలకోసారి హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన కిషన్‌రెడ్డి… గతంలో డీఆర్సీ విూటింగ్ లు ఉండేవి… కేసీఆర్ సర్కార్ వచ్చాక ఆ విూటింగ్‌లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తే సీఎం ఒక్కసారి విూటింగ్ పెట్టారన్నారు. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాలకు అతీగతి లేదని, వేసిన సబ్ కమిటీలు ఏమయ్యాయో తెలియదన్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పాలన కొనసాగిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో తెరాస పాలన సాగిస్తుందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి విడుదల చేసిన నివేదికలో మాత్రం వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతారని, అదే రాజ్ భవన్ ముందు ఇంకా నీళ్ళు అగుతూనే ఉన్నాయన్నారు. పేదల ఇళ్లలోకి మురికి నీరు రావడం ఆగిపోలేదని, రోడ్లపై గుంతలు అలానే ఉన్నాయని, నాలాలో పూడిక అలానే ఉందని, విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయని, ట్రాఫిక్ జాం యథావిథిగా ఉన్నాయని ఇదేనా విూ అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని చెప్పారని, కానీ, కనీసం ఆ ప్రయత్నం జరిగిందా అని నిలదీశారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఆ పక్కనే పేదలకు ఇళ్లు అన్నారు ఆవి ఏమయ్యాయి అంటూ కిషన్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కేవలం మాటల గారడితోనే ప్రభుత్వం పాలన సాగిస్తుందని, నిధులు లెక్కలు చూపుతున్నారు తప్ప సమస్యలు ఎక్కడా పరిష్కారం కావటం లేదని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని కిషన్‌రెడ్డి
హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది




