జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆకస్మిక తనిఖీ

రోడ్డుపై మురికినీరు వదిలిన ఫ్లాట్‌ యజమానికి జరిమానా
హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):మురికినీరు రోడ్డుపై వదిలినందుకు ఫ్లాట్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ నిన్న యూసఫ్‌గూడ, ప్రశాసన్‌ నగర్‌, కృష్ణానగర్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రి సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రోడ్డు వెంబడి నిర్మాణాలను, శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రోడ్డుపై మురికినీరు వదలడాన్ని గమనించిన కమిషనర్‌ ఫ్లాట్‌ యజమానికి జరిమానా విధించారు.  మురికినీరు రోడ్డుపై వదిలినందుకు ఫ్లాట్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ నిన్న యూసఫ్‌గూడ, ప్రశాసన్‌ నగర్‌, కృష్ణానగర్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రి సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రోడ్డు వెంబడి నిర్మాణాలను, శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రోడ్డుపై మురికినీరు వదలడాన్ని గమనించిన కమిషనర్‌ ఫ్లాట్‌ యజమానికి జరిమానా విధించారు.